BIKKI NEWS (SEP. 16) : New Ration cards application in telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి నూతన రేషన్ కార్డులు జారీ చేయడానికి అర్హులైన పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వనించనున్నట్లు సమాచారం.
New Ration cards application in telangana
ఈ మేరకు నూతన రేషన్ కార్డుల జారీ పై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక రూపొందించినట్లు సమాచారం. త్వరలోనే నూతన రేషన్ కార్డుల జారీ పై మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
సెప్టెంబర్ 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మందికి నూతన రేషన్ కార్డులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అనేక పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు నూతన రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు.