- ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె మహేష్ కుమార్ & 2152 సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 8, 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న దాదాపు 2000 మంది గెస్ట్ లెక్చరర్లకు పీఆర్సీ 30% ప్రకారం పీరియడ్ కు ప్రస్తుతం ఇస్తున్న 300 నుండి 390 వరకు పెంచుతూ జీవో నంబర్ 1105 ను ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి రొనాల్డ్ రాస్ గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా పీఆర్సీ ఫలాలను జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లకూ వర్తింపజేయడం పట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, కోశాధికారి బండి కృష్ణ, ఉపాధ్యక్షుడు ఎం బాబురావు లు, రాష్ట్ర కమిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో జీవో విడుదలకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ లకు, సహకరించిన ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ బాధ్యులు ఎం జంగయ్య, ఎం రామకృష్ణ గౌడ్ లకు, ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వివిధ సంఘాల బాధ్యులు, నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
Follow Us @