ఆమన్‌ఘల్ లో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు

హైదరాబాద్ (జూలై – 06) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమన్‌ఘల్ లో నూతన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసింది.

ఈ విద్యా సంవత్సరం 2023 – 24 నుండి తరగతుల ప్రారంభం కానున్నాయి.. త్వరలోనే ఈ కళాశాలకు సంబంధించిన కోర్సులను, సిబ్బందిని నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వనున్నారు.