SERP ఉద్యోగులకు నూతన పే స్కేల్ ఉత్తర్వులు

హైదరాబాద్ (మార్చి -18) : తెలంగాణ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న 3,984 SERP, మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, మండల బుక్ కీపర్స్, కమ్యూనీటి కోఆర్డినేటర్స్, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్స్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్స్, ప్రాజెక్టు మేనేజర్స్, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డీనేట్స్, అడ్మినిస్ట్రేషన్స్ అసిస్టెంట్ ఉద్యోగులకు నూతన పే స్కేల్ ను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఈ ఉద్యోగులకు నూతన పే స్కేల్ ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.