ఇంటర్ విద్యా మండలి ఎస్ఎస్సి బోర్డులో విలీనం .!

జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో +2 విద్యా విధానం అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో విలీనం కావాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై స్పష్టమైన వైఖరితో ఉందని సమాచారం ఇదే జరిగితే ఎస్ఎస్సి బోర్డు కీలకంగా మారనుంది. ఇంటర్ విద్యా మండలి ఎస్ఎస్సి బోర్డులో విలీనం కానుంది.

ఇప్పటికీ ఈ అంశం పై విద్యాశాఖ చర్చలు జరిపి ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఒకేసారి పాఠశాలలను అప్ గ్రేడ్ చేయాలా లేక దశలవారీగా చేయాలా అన్న మీమాంస కొనసాగుతోంది. దీని వల్ల డ్రాపవుట్లు సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని విద్యావేత్తల అభిప్రాయం.

Follow Us@