ఇంటర్ విద్య కేడర్ స్ట్రెంథ్ నివేదిక

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ఎంప్లాయిస్ లోకల్ క్యాడర్ స్ట్రెంథ్ మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ – 2018 ప్రకారం తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులను నూతనంగా ఏర్పడిన 33 జిల్లాలకు అన్వయిస్తూ క్యాడర్, యూనిట్ వారీగా మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయి క్యాడర్ లుగా విభజిస్తూ ఇంటర్మీడియట్ కమీషనరేట్ నివేదిక తయారు చేసింది.

ఈ నివేదిక ప్రకారం మల్టీ జోనల్, జోనల్, జిల్లాస్థాయి కేడర్ లను గుర్తిస్తూ.. అలాగే కళాశాల స్థాయి నుంచి జిల్లా ఇంటర్ విద్యాధికారి, ఆర్జేడీఐ కార్యాలయం మరియు ఇంటర్మీడియట్ కమీషనరేట్ ప్రధాన కార్యాలయం వరకు పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులను నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం నూతన జిల్లాల ప్రకారం అన్వయిస్తూ పూర్తి నివేదికను రూపొందించారు.

ఇకనుండి భవిష్యత్తులో నూతన ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలు కూడా ఈ నూతన జోనల్ విధానం మరియు ప్రస్తుత కేడర్ స్ట్రెంథ్ ఆధారంగానే చేపట్టనున్నట్లు సమాచారం.

CADRE STRENGTH REPORT OF TS CIE

Follow Us @