నూతన అటార్నీ జనరల్ గా ఆర్. వెంకటరమణి

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 29) : భారత నూతన అటార్నీ జనరల్ (AG)గా సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆర్. వెంకటరమణి ని తదుపరి నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీచేశారు.

ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం ఏజీగా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్ పదవీ కాలం సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఏజీగా వెంకటరమణిని నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.