హైదరాబాద్ (సెప్టెంబర్ – 08) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో 15 నూతన బాలుర, బాలికల బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది.
ఈ విద్యా సంవత్సరం కేవలం ప్రథమ సంవత్సరం లో మాత్రమే దాదాపు 4,800 అడ్మిషన్లు తీసుకోనున్నారు. అలాగే ప్రిన్సిపాల్ మరియు టీచింగ్ సిబ్బందిని తాత్కాలికంగా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు.
అడ్మిషన్లకు చివరి తేదీ అక్టోబర్ 10 గాను, సిబ్బంది నియామకాలకు గడువు ను అక్టోబర్ 12 వరకు నిర్ణయించారు.
1) కరీంనగర్ (G)
2) యల్లారెడ్డిపేట (B) (సిరిసిల్ల)
3)ధర్మపురి (B) (జగిత్యాల)
4) నిజామాబాద్ (G)
5) ఖమ్మం (G)
6) హైదరాబాద్ (G)
7) కందుకూరు (B) (రంగారెడ్డి)
8) మెడ్చల్ (G)
9) పాలకుర్తి (B) (జనగామ)
10) స్టేషన్ ఘన్‌పూర్ (G) (జనగామ)
11) నాగార్జున సాగర్ (B) (నల్గొండ)
12) దేవరకొండ (B) (మహబూబ్ నగర్)
13) వనపర్తి (G)
14) మెదక్ (B)
15) నిర్మల్ (B)