జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఒకే పరీక్ష పెట్టాలని నూతన విద్యా విధానంలో ఉన్నది. అయితే ఇది అమలు సాధ్యం కాదని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీని వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ముఖ్యంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులకు ఒకేసారి పరీక్ష పెట్టడం కోవిడ్ సమయంలో సాధ్యం కాదని, అలాగే అన్ని రాష్ట్రాలలో కామన్ సిలబస్ లేదని, అడ్మిషన్లు ప్రక్రియలో గందరగోళం ఏర్పడుతుందని.. ఇలా పలు కారణాల వల్ల జాతీయ స్థాయి పరీక్షలకు ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్రాలు బావిస్తున్నాయి.
తెలంగాణలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ సిలబస్‌కు అనుగుణంగా ఎంసెట్ ఉంటుంది. పట్టణ ప్రాంత విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తగ్గట్టుగా ప్రవేశపరీక్ష ఉంటుంది. అయితే, ఎంసెట్‌ను రద్దు చేసి, జాతీయ స్థాయి పరీక్ష నిర్వహిస్తే గ్రామీణ విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us@ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఒకే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష సాధ్యం కాదు అని, దీని వలన గందరగోళం పరిస్థితులు ఎర్పడుతాయని కావునా ఈ విధానంపై సమీక్షించవలసినదిగా కేంద్రానికి రాష్ట్రం తరఫున లేఖ రాస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి తెలిపారు.