హైదరాబాద్ (మే – 07) : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2023 (NEET UG – 2023 EXAM) ప్రవేశ పరీక్షను నేడు దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 20 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 80,000 మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షను ఓఎంఆర్ షీట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
◆ తీసుకొవాల్సిన జాగ్రత్తలు :
- యూజీ నీట్-2023 అర్హత పరీక్షకు
హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒక ఫొటో ఐడెంటిటీ కార్డు సెంటర్ కు తీసుకెళ్లాలి.
- అడ్మిట్ కార్డులో పేర్కొన్న విధంగా నిర్దేశించిన చోట పోస్ట్ కార్డు సైజ్ ఫొటోను అతికించి సంతకం చేయాలి.
- ఎన్టీఏ నిర్దేశాల మేరకు విద్యార్థులు
డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాలి.
పొడవు చేతులున్న డ్రెస్సులు, బూట్లు, నగలు, మెటల్ వస్తువులను పరీక్షళహాలులోకి అనుమతించరు.
- స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే ధరించాలి.
- విద్యార్థి వెంట ఇతరత్రా పేపర్లు,
జామెట్రీ, పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్
పౌచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్కేళ్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్నులు తదితరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- చేతి గడియారాలు, వాలెట్లు,
హ్యాండ్ బ్యాగులు, బెల్టు, టోపీలను
కూడా అనుమతించరు.
- అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు
హాలులోనే బాల్ పాయింట్ పెన్నును అందిస్తారు.