NEET UG : MPC తో కూడా డాక్టర్ అర్హత

హైదరాబాద్ (నవంబర్ 24) : ఇంటర్మడియట్ లో బయాలజీ చదవని విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ప్రత్యామ్నాయంగా మరో అవకాశం ఇచ్చింది. ఇలాంటి విద్యార్థులు అదనపు సబ్జెక్టుగా బయాలజీని చదివి.. నీట్ యూజీకి హాజరు కావొచ్చని (neet ug eligibility with mpc group also) నేషనల్ మెడికల్ కమిషన్ సర్క్యులర్ ను జారీ చేసింది.

ఇంటర్మీడియట్ విద్యలో అనేక సబ్జెక్టు కాంబినేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు బయెటెక్నాలజీ ఇతర సబ్జెక్టులను విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇలాంటి వారికి నీట్ యూజీ రాసేందుకు అవకాశం లేదు. దీంతో ఎంబీబీఎస్ చదువుకు దూరం అవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయా విద్యార్థుల కోసం ఎన్ఎంసీ ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నది. గతంలో తిరస్కరించిన నీట్ దరఖాస్తులకు ఇది వర్తిస్తుందని ఎన్ఎంసీ పేర్కొన్నది.