NEET UG RESULTS – పరీక్ష కేంద్రం, నగరాల వారీగా ఫలితాల లింక్

BIKKI NEWS (JULY 20) : NEET-UG 2024 CENTRE and CITY WISE RESULTS. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష కేంద్రాలు మరియు పరీక్ష నిర్వహించిన నగరాల వారీగా నీట్ యూజీ 2024 ఫ‌లితాల‌ను అధికారిక వెబ్‌ సైట్‌లో ప్ర‌చురించింది. ఈ నీట్ యూజీ ఫ‌లితాల‌ను కింద ఇవ్వబడిన లింక్‌లో చూడ‌వచ్చు.

NEET-UG 2024 CENTRE and CITY WISE RESULTS

నీట్ యూజీ 2024 పరీక్షలలో జరిగిన అవకతవకలు మరియు పేపర్ లీకేజీ అంశాలపై దేశ వ్యాప్తంగా నిరసనలం తీవ్రమైన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి.

ప‌రీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫ‌లితాల‌ను వెల్ల‌డించాల‌ని సుప్రీం కొర్టు లో పిటీష‌న్లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. ఆ కేసులో సుప్రీం తీర్పునిస్తూ.. ప‌రీక్ష కేంద్రాల వారీగా మార్క్‌ల‌ను వెల్ల‌డించాల‌ని ఎన్టీఏకు సుప్రీం ఆదేశించింది. ప్ర‌తి సెంట‌ర్‌, ప్ర‌తి న‌గ‌రానికి చెందిన ఫ‌లితాల‌ను రిజ‌ల్ట్స్‌ను డిక్లేర్ చేయాల‌ని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్ర‌కార‌మే ఇవాళ ఫ‌లితాల‌ను వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు.

NEET UG CENTRE WISE AND CITY WISE RESULTS LINK

జూలై 20 మధ్యాహ్నం 12 గంటల లోపు ఫ‌లితాల‌ను రిలీజ్ చేయాల‌ని సుప్రీం గడువు విధించిన విష‌యం తెలిసిందే. అయితే అభ్యర్థుల గుర్తింపును మాత్రం గోప్యంగా ఉంచాలని సూచించింది. నీట్‌-యూజీ 2024 లో అక్రమాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పీబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.

పూర్తి స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని ఒక బలమైన నిర్ధారణకు వస్తేనే మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ ఫలితాలు అనంతరం తదుపరి విచారణను జూలై 22న చేపట్టనున్నట్లు సుప్రీం కోర్ట్ తెలిపింది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు