NEET UG : తెలంగాణ అభ్యర్థుల ర్యాంకుల వారీగా జాబితా విడుదల

హనుమకొండ (జూన్ – 03) : నీట్ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET UG 2023 TELANGANA CANDIDATES LIST )లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) ఈరోజు విడుదల చేసింది. నీట్ ర్యాంకుల వారీగా అభ్యర్థుల వివరాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి రాష్ట్రానికి అందాయి. నీట్ పరీక్ష దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారీగా చేసిన నమోదు ఆధారంగానే ఈ జాబితా ప్రకటిస్తున్నట్లు యూనివర్సిటీ తెలిసింది. ఇది సమాచార నిమిత్తమేనని.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు యూనివర్సిటీ మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఈ ఏడాది జనరల్‌ కేటగిరీలో 137 మార్కులు, దివ్యాంగులకు 121, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు.

అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువ పత్రాలను పరిశీలించిన తర్వాత యూనివర్సిటీ మెరిట్ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. కాగా, యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 7న జాతీయ స్థాయిలో నీట్‌ ఎంట్రెన్స్‌ నిర్వహించగా, జూన్‌ 13న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. ఇదిలా ఉండగా..