NEET 2023 : తెలుగులోనూ నీట్ పరీక్ష

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 24) : జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నీట్ యూజీ 2023 పరీక్షను కూడా ప్రాంతీయ భాషల్లో (neet-ug-2023-exam-in-telugu-language-also) నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది.

నీట్ యూజీ పరీక్ష ఇంగ్లీష్ తో పాటు 12 ప్రాంతీయ భాషల్లో కూడా ప్రశ్నాపత్రాలు ఉండనున్నాయి.

మే 7 వ తారీకు మధ్యాహ్నం రెండు గంటల నుండి 5.20 గంటల వరకు జరిగే నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రం తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీషు తో పాటు తెలుగు భాషలోనూ ఉండనుంది.