న్యూడిల్లీ (ఎప్రిల్ – 30) : మే 7న నిర్వహించే నీట్ యూజీ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ (neet ug city intimation slip) విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది.. సిటీ ఇంటిమేషన్ స్లిప్ లో అభ్యర్థులు పరీక్ష రాసే నగరం, పరీక్ష తేదీ వివరాలు ఉంటాయి.
ఈసారి తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎన్టీఏ త్వరలోనే అందుబాటులో ఉంచనుంది.
నీట్ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా.