న్యూడిల్లీ (మార్చి 15) : NEET PG -2023 ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 2.92 లక్షల మంది అభ్యర్థులు నీట్ పీజీకి దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19,953 ఎండీ, 10,821 ఎంఎస్, 1,979 పీజీ డిప్లొమా సీట్లు అందుబాటులో ఉన్నాయి.