న్యూడిల్లీ (జనవరి – 09) : నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 2023 (NEET PG – 2023) ప్రవేశ పరీక్షకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండి, ఎంఎస్, పి జి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
◆ అర్హతలు : ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
( 31.03.2023 నాటికి ఏడాది ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి)
◆ ఎంపిక విధానం : రాత పరీక్ష ద్వారా (CBRT)
◆ పరీక్షా విధానం : ఈ పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఉంటుంది. దీనిలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.
◆ దరఖాస్తు రుసుము : 4250/- (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 3250/- చెల్లించాలి.)
◆ దరఖాస్తు పద్దతి : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి – 27 – 2023.
◆ ఎడిట్ చేసుకోవడానికి చివరి తేదీ : 30.01.2023 నుంచి 03.02.2023 వరకు.
◆ హాల్టికెట్ డౌన్లోడ్ కి చివరి తేదీ : ఫిబ్రవరి – 27 – 2023.
◆ పరీక్ష తేదీ : మార్చి – 03 – 2023.