NEET MERIT LIST : నిబంధనలు మార్పు

హైదరాబాద్ (జూన్ – 17) : నీట్ మెరిట్ లిస్టులో తయారీ ప్రక్రియలో నిబంధనలను మార్చాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ర్యాంకుల తయారీలో మార్కులు సమానంగా వస్తే బయాలజీలో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మొదటి ర్యాంకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటినుండి ఫిజిక్స్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మొదటి ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అన్ని సబ్జెక్టులలో సమానంగా మార్కులు వస్తే కంప్యూటర్ ద్వారా డ్రా తీసి ర్యాంకును నిర్ణయించనున్నట్లు సమాచారం వచ్చే నీట్ పరీక్ష నుండి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నట్లం సమాచారం.

ప్రస్తుతం మార్కుల సమానంగా ఉన్నప్పుడు బయాలజీ లో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటి ర్యాంక్ ను… బయాలజీలో సమానంగా ఉంటే కెమిస్ట్రీలో ఎక్కువ మార్కుల ఉన్న వారికి మొదటి ర్యాంక్ ను…. కెమిస్ట్రీలోనూ సమానంగా మార్కులు ఉంటే ఫిజిక్స్ లో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటి ర్యాంకును కేటాయిస్తున్నారు. మూడు సబ్జెక్టులలోనూ సమానంగా మార్కులు ఉంటే ఎక్కువ వయసు ఉన్నవారికి మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారు.

ఇప్పటినుండి ఫిజిక్స్ సబ్జెక్టు మొదటి ప్రాధాన్యతగా… తర్వాత కెమిస్ట్రీ ఆ తర్వాత బయాలజీ ఆ తర్వాత వయసులను చూడనున్నారు… వయసు కూడా సమానంగా ఉంటే కంప్యూటర్ ఆధారంగా డ్రా తీసి ర్యాంకులను కేటాయించనున్నారు.