వరంగల్ (సెప్టెంబర్- 24) : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ (KNRUHS) NEET – 2022 కు సంబంధించిన తెలంగాణ స్థాయిలో ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకుల ఆధారంగా ఎంబిబిఎస్, బిడిఎస్ సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
మొత్తం 36,795 మందికి ర్యాంకులను కేటాయించింది. ఓపెన్ కేటగిరీలో 117, BC, SC, ST, PWD కేటగిరీలో 93, PWD (G) కేటగిరీలో 105 మార్కులను కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించారు.