టోక్యో ఒలింపిక్స్ – జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా కు బంగారు పథకం

  • భారత్ కి గోల్డెన్ డే
  • బంగారపు వాసన చూపించిన నీరజ్ చోప్రా
  • వందేళ్లలో ఒకే ఒక్కడు
  • జావెలిన్ త్రో లో ఒలింపిక్ బంగారు పథకం సాదించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలిపిక్స్ -2020 లో జావలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ లో తొలి అవకాశం లో భారత్ తరపున నీరజ్ చోప్రా మొదటి అవకాశం లోనే 87.03 మీటర్లు, రెండవ అవకాశం లోనే 87.58 మీటర్లు విసిరి ఒలింపిక్స్ బంగారు పథకాన్ని గురి చూసి కొట్టాడు.

రెండవ అవకాశం లోనే 87.58 మీటర్లు విసిరి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

మొత్తం ఫైనల్ మ్యాచ్లో ఒక్కో ఆథ్లెట్ కు 6 అవకాశాలను ఇస్తారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన కు గోల్డ్ మెడల్ గా నిర్ణయిస్తారు.

100 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలోనే భారత్ కు ఆథ్లెటిక్స్ లో స్వర్ణ పథకం లేదు. ఆ లోటు ని నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ – 2020 లో తీర్చాడు.

ఇప్పటి వరకు లండన్ ఒలింపిక్స్ లో మొత్తంగా ఆరు పథకాలు సాదించిన భారత్ టోక్యో ఒలింపిక్స్ ఇప్పటికే 7 పథకాలతో లో ఆ రికార్డు ను బ్రేక్ చేసింది.

GOLD THROW – 87.58 METERS

Follow Us @