NDA, NA కోర్సుల్లో ప్రవేశాలకు UPSC నోటిఫికేషన్

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC).. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(NDA), నావల్‌ అకాడెమీ(NA) కోర్సుల్లో ప్రవేశాలకు అవివాహిత పురుష /మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల పేరు :: NDA & NA ఎగ్జామ్‌(1) – 2022

పోస్టుల సంఖ్య :: 400

పోస్టుల వివరాలు :: ఎన్‌డీఏ–370 (ఆర్మీ –208, నేవీ– 42, ఎయిర్‌ఫోర్స్‌–120);
నావల్‌ అకాడెమీ–30 (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌).

● అర్హతలు ::

  • ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ వింగ్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి.
  • ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి :: 2003 – జూలై – 2 నుంచి 2006 – జూలై -1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక పద్దతి :: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేది :: జనవరి – 11- 2022

పరీక్ష తేది :: ఎప్రిల్ – 10 – 2022

వెబ్సైట్‌ :: https://www.upsc.gov.in

ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ::

పూర్తి నోటిఫికేషన్