హైదరాబాద్ (జూన్ – 28) : ఇంటర్మీడియట్ తో విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీలో(integrated Bed Notification) చేరేందుకు 2023-24 విద్యా సంవత్సరానికి నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET 2023) పేరుతో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఏ-బీఈడీ, బీయస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జులై 19వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
రాష్ట్రంలో ఉర్దూ విశ్వవిద్యాలయం, వరంగల్ ఎన్ఐటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలకు కొత్త కోర్సులు మంజూరు కాగా వాటిలో మొత్తం 250 సీట్లున్నాయి.