ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NCC యూనిట్ల ఏర్పాటుకు చర్యలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)ఏర్పాటుకు ఇంటర్మీడియట్ కమీషనరేట్ చర్యలు ప్రారంభించింది. 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను అర్హత ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో NCC యూనిట్ ల ఏర్పాటుకు జిల్లా ఇంటర్ విద్యాధికారి నుంచి కళాశాలల వివరాలను సేకరించవలసిందిగా కోరింది.

నేషనల్ క్యాడెట్ కార్ప్స్ మంజూరు కోసం కళాశాలలో ఈ విద్యా సంవత్సరం 500 అడ్మిషన్లు కలిగి ఉండాలి.
సొంత బిల్డింగ్ మరియు ప్లేగ్రౌండ్ కలిగి ఉండాలి.

రెగ్యులర్ జూనియర్ అధ్యాపకుడు లేదా ఫిజికల్ డైరెక్టర్ లేదా లైబ్రేరియన్ లను NCC కో ఆర్డనేటర్ లుగా నియమించుకునే అవకాశం ఉన్న కళాశాల వివరాలు పంపవలసిందిగా ఇంటర్మీడియట్ కమిషనర్ జిల్లా ఇంటర్ విద్యా అధికారులకు సూచించారు.

Follow Us @