హైదరాబాద్ (నవంబర్ – 08) : దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలలో (JNVS) 2024 – 25 విద్యా సంవత్సరానికై 9వ, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్ష (JNV LEST 2024 NOTIFICATION) కొరకు దరఖాస్తు గడువును నవంబర్ – 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష (NVS LEST 2024) ద్వారా ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో తరగతులు IX & XIకు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్న విషయం తెలిసిందే. పూర్తి నోటిఫికేషన్ కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.
దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ను నవంబర్ 16, 17 వ తేదీలలో కల్పించినట్లు నవోదయ విద్యాలయ సమితి తెలిపింది.