ఇంటర్మీడియట్ కమీషనర్ గా నవీన్ మిట్టల్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 24) : తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ మరియు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న సయ్యద్ ఉమర్ జలీల్ ఈ నెలాఖరు లో పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో తదుపరి ఈ భాద్యతలను కాలేజీయోట్ ఎడ్యుకేషన్ కమీషనర్ నవీన్ మిట్టల్ కు అప్పగిస్తూ ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

1998 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సయ్యద్ ఉమర్ జలీల్ సెప్టెంబర్ – 30 – 2022 న పదవి నుంచి రిటైర్మెంట్ కానున్నారు.