BIKKI NEWS (JAN. 25) : భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను (NATIONAL VOTERS DAY ON JANUARY 25th) జరుపుకుంటారు.
NATIONAL VOTERS DAY ON JANUARY 25th
ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారత ఎన్నికల సంఘం 25 జనవరి 2025న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (NVD) జరుపుకుంటోంది.
National Voters Day 2025 Theme
Nothing Like Voting, I Vote for Sure”
VOTERS DAY HISTORY
ఇది 2011 జనవరి 25 నుండి జాతీయ ఎన్నికల కమిషన్ ఏర్పడిన రోజును గుర్తించడానికి ప్రారంభమైంది. జాతీయ ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న ఏర్పాటు చేశారు.
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన భారత కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి సమాచార, ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ 18 సంవత్సరాల వయసున్న కొత్త ఓటర్లు, ఎన్నికల రికార్డుల్లో పాల్గొనడానికి తక్కువ ఆసక్తిని చూపిస్తున్నారని, వారి నమోదు స్థాయి కొన్ని సందర్భాల్లో 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడంతో సమస్యను సమర్థవంతంగా పరిష్కరించేందుకు, దేశవ్యాప్తంగా 8.5 లక్షల పోలింగ్ కేంద్రంలలో ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు వచ్చే అర్హతగల అన్ని ఓటర్లు గుర్తించడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టాలని భారత ఎన్నికల కమిషను నిర్ణయించింది.
ఇటువంటి అర్హత కలిగిన ఓటర్లు సమయానికి నమోదు చేసి ప్రతి సంవత్సరం జనవరి 25న వారి ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు అందచెయ్యాలని, ఈ చొరవ యువతకి సాధికారత, వారి బాధ్యతలను నిర్వర్తించటానికి స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు.
1988 కంటే ముందు 21 సంవత్సరాలు వయస్సు నిండిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ బిల్లు (1988) ద్వారా ఓటింగ్ హక్కు ను 18 సంవత్సరాలకు తగ్గించారు.
- UGC NET JUNE 2025 నోటిఫికేషన్ – దరఖాస్తు లింక్
- IND PAK WAR – పాక్ ప్రధాని ఇంటి సమీపంలో దాడి
- INDIA PAK WAR – కరాచీ పోర్ట్ పై భారత్ దాడి
- INDO PAK WAR – త్రివిధ దళాలతో దాడికి సిద్దమవుతున్న భారత్.!
- INDO PAK WAR – యుద్ధం ఆరంభం