Home > ESSAYS > NATIONAL SCIENCE DAY – జాతీయ విజ్ఞాన దినోత్సవం

NATIONAL SCIENCE DAY – జాతీయ విజ్ఞాన దినోత్సవం

BIKKI NEWS (FEB. 28) : జాతీయ విజ్ఞాన దినోత్సవమును (national science day on February 28th – the cv raman effect) భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జరుపుకుంటారు.

రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన చంద్రశేఖర వేంకట రామన్ 28-02-1928న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు. ఆయన ఈ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే గా జరుపుకుంటున్నారు.

★ సి.వి.రామన్

రామన్‌ ఎఫెక్ట్‌ అనే అంశం పై నేచర్‌ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో సి.వి.రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది.

వీరికి 1954లో భారతరత్న బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్