నేషనల్ రిసెర్చ్ ఫెలోషిప్ కు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (ఫిబ్రవరి 24) : ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (IPE) సోషల్ సైన్సెస్ లో నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఐపీఈ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సోషల్ సైన్సెస్ లో డాక్టరేట్ చేస్తున్న 40 ఏండ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మార్చి 10లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

◆ వెబ్సైట్ : https://www.ipeindia.org/nrf