జాతీయ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు

  • అర్హత సాదించిన ఇంటర్మీడియట్ విద్యార్థుల లిస్ట్

జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MHRD) వారు ఇచ్చే జాతీయ మెరిట్ స్కాలర్షిప్ ప్రెష్ మరియు రెన్యూవల్ 2021 దరఖాస్తు గడువును జనవరి – 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కావున విద్యార్థులు, పేరెంట్స్ మరియు కళాశాల యాజమాన్యాలు మెరిట్ విద్యార్థులను దరఖాస్తు చేసుకోవడానికి పొత్సహించాలని పేర్కొన్నారు.

విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి గడువు జనవరి – 15 – 2022 మరియు యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దరఖాస్తు గడువును జనవరి – 31 – 2022 వరకు కలదు.

2020 – 21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తయిన 81,594 మంది మెరిట్ విద్యార్థులతో కూడిన జాబితాను ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ నందు ఉంచడం జరిగిందని బోర్డు తెలిపింది.

దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ ::
https://scholarships.gov.in/

ఇంటర్మీడియట్ లో అర్హత పొందిన విద్యార్థుల జాబితా