నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్ గడువు పెంపు

సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ పథకం (నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్) దరఖాస్తు గడువును భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నూతన మరియు రెన్యూవల్ ల రెండింటి దరఖాస్తుల చివరి తేదీ నవంబర్ – 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తాజా దరఖాస్తు కొరకు 2020-2021 లో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులైన విద్యార్ధులందరికి ఇది వర్తిస్తుంది. ఇంతకు ముందు జాతీయ స్కాలర్ షిప్ కోసం ఎంపికైన విద్యార్ధులు 2021-2022 విద్యా సంవత్సరానికి తమ ధరఖాస్తులను పునరుద్ధరించుకోవచ్చు.

అలాగే విద్యా సంస్థల సంస్థాగత ధృవీకరణకు చివరి తేదీని డిసెంబర్ – 12 – 2021 వరకు పెంచడం జరిగింది.

విద్యార్ధులందరూ కింది వెబ్సైట్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

http://scholarships.gov.in

తాత్కాలికంగా ఎంపిక చేసిన ఇంటర్మీడియట్ అభ్యర్థుల జాబితా (81,594) అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.

www.tsbie.cgg.gov.in