NMMS 2023 SCHOLARSHIP : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్

విజయవాడ (ఆగస్టు – 11) : కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఎనిమిదవ తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి 12వేల చొప్పున ఉపకార వేతనం అందించే నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP 2023 – 2024) నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం విడుదల చేసింది.

★ వివరాలు :

NATIONAL MEANS CUM MERIT SCHOLARSHIP 2023 – 2024

స్కాలర్‌షిప్ : 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సంవత్సరానికి 12వేల చొప్పున ఉపకార వేతనం

అర్హతలు : ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలలో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి.
ఏడవ తరగతిలో 55% మార్కులు సాధించి ఉండాలి.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.50 లక్షలకు మించి ఉండకూడదు

ఎంపిక విధానం : రెండు పేపర్లు తో రాత పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం : చదువుతున్న పాఠశాల ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు పీజు : 100/- (SC, ST – 100/-)

దరఖాస్తు గడువు : ఆగస్టు – 10 నుంచి సెప్టెంబర్ 15 వరకు

డీఈవో కు సమర్పించాల్సిన తేదీ : సెప్టెంబర్ 19 లోపల

డీఈవో ఆమోదించడానికి చివరి తేదీ : సెప్టెంబర్ – 22 లోపల

◆వెబ్సైట్ : https://www.bse.ap.gov.in/