Home > TODAY IN HISTORY > NATIONAL MATHEMATICS DAY – జాతీయ గణిత దినోత్సవం

NATIONAL MATHEMATICS DAY – జాతీయ గణిత దినోత్సవం

BIKKI NEWS (DECEMBER – 22) – NATIONAL MATHEMATICS DAY – జాతీయ గణిత దినోత్సవంను డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు.

సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది.