NATIONAL LAW DAY – జాతీయ న్యాయ దినోత్సవం

BIKKI NEWS (NOV – 26) : భారతదేశంలో జాతీయ న్యాయ దినోత్సవాన్ని (national law day) ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు. 1979లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబరు 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు.

1949లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ న్యాయ దినోత్సవంను నవంబర్ – 26న జరుపుకుంటారు.

భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ తేదిని జాతీయ న్యాయ దినోత్సవంగా ఎంచుకున్నారు.