Home > TODAY IN HISTORY > National Girl Child Day – జాతీయ బాలికా దినోత్సవం

National Girl Child Day – జాతీయ బాలికా దినోత్సవం

BIKKI NEWS (JAN. 24) : జాతీయ బాలికా దినోత్సవం (National Girl Child Day) ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించబడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు.

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది.

సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపుకుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తారు.

సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపుకుంటారు. అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరం. సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగుతుంది.