NExT పాసైతేనే వైద్య పీజీ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూలై 03) : ఎంబీబీఎస్ అనంతరం పీజీ చేయాలనుకొనే విద్యార్థులకు నూతన ప్రవేశ పరీక్ష National Exit Test (NExT) నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ప్రకటించింది. దీంతో NEET PG ప్రవేశ పరీక్ష కనుమరుగు కానుంది.

NExT పేరుతో నిర్వహించే ఈ పరీక్ష పాసైతేనే పీజీ చేయడానికి అర్హులు కానున్నారు. అంతే కాదు.. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగానే పీజీ సీట్లను కేటాయిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య చదివిన విద్యార్థులు దేశంలో వైద్యవృత్తిని ప్రాక్టీస్ చేయాలంటే ఈ ప్రవేశ పరీక్ష కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ తరపున కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజాగా గెజిట్ విడుదల చేసింది.

దీని ప్రకారం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం / చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ రాయడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్షలో రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో థియరీ పరీక్ష, రెండో దశలో ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఒక అభ్యర్థి ఎంబీబీఎస్ లో చేరినప్పటి నుంచి పదేండ్లలోపు ఎన్నిసార్లయినా స్టెప్-1, స్టెప్-2 పరీక్ష రాసుకోవచ్చు