Home > CURRENT AFFAIRS > NATIONAL CURRENT AFFAIRS DECEMBER 2023

NATIONAL CURRENT AFFAIRS DECEMBER 2023

BIKKI NEWS : NATIONAL CURRENT AFFAIRS DECEMBER 2023 – 2023 డిసెంబర్ నెలలో జాతీయ స్థాయిలో జరిగిన ముఖ్య కరెంట్ అఫైర్స్ ను పోటీ పరీక్షల నేపథ్యంలో మీకోసం..

1) దేశంలోనే తొలిసారిగా ప్రతి జిల్లా కేంద్రంలో హాల్ మార్క్ కేంద్రం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది.?
జ : కేరళ

2) భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏ సంవత్సరం నుండి జాతీయ ఏక్తా దివస్ గా నిర్వహిస్తుంది.?
జ : 2014

3) హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులతో ఏ నగరంలో తొలి కేఫ్ ను ఏర్పాటు చేశారు.?
జ : కోల్‌కతా

4) ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించే ఐక్యరాజ్య సమితి యొక్క “కోడెక్స్ ఆలిమాంటేరియష్ కమీషన్” లో ఆసియా ప్రాంతం నుంచి ఏ దేశం సభ్య దేశంగా ఎన్నికయింది.?
జ : భారతదేశం

5) ఏ రాష్ట్రం మూడు టైగర్ రిజర్వులను ఏర్పాటు చేయడానికి టైగర్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్సులను ఏర్పాటు చేసింది.?
జ : అరుణాచల్ ప్రదేశ్

6) ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ – 2023 గా ఏ పదం ని ప్రకటించారు.?
జ : RIZZ

7) నావికా దళ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 04

8) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) విడుదల చేసే యాన్యువల్ మ్యాగజైన్ పేరు ఏమిటి.?
జ : బోర్డర్ మ్యాన్

9) ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆసియాటిక్ సింహాలకు రెండో ఆవాసంగా మారనుంది.?
జ : భార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ

10) జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ – 02

11) ఇటీవల భారత్ లో పర్యటిస్తున్న కెన్యా అధ్యక్షుడు ఎవరు.?
జ : విలియం సమోయీ రూటో

12) జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఎంతకు పెంచుతూ పార్లమెంట్ బిల్లు ఆమోదించింది.?
జ : 83 నుండి 90

13) యూనెస్కో సాంస్కృతిక ప్రపంచ వారసత్వ సంపద గా భారత్ నుంచి ఏ నృత్యం ఎంపికైంది.?
జ : గార్బా (గుజరాత్)

14) మిజోరాం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నూతన పార్టీ ఏది.?
జ : జోరం మువ్‌మెంట్ పీపుల్స్ (JMP)

15) పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) కు ఎన్ని అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశారు.?
జ : 24

16) ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ ఇటీవల విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి?
జ : PRANAB MUKARJEE, MY FATHER – A DAUGHTER REMEMBER

17) స్వచ్ఛభారత్ గ్రామీణ్ మిషన్ లో భాగంగా 100% ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలు కలిగిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది.?
జ : ఉత్తర ప్రదేశ్

18) సాయుధ బలగాల పతాక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 7

19) అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 7

20) ఏ రాష్ట్రం ఐదవ హనీ బీ దినోత్సవం జరుపుకుంది.?
జ : నాగాలాండ్

21) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ నగరం పేరు ను ఏమని మార్చడానికి మున్సిపాలిటీ తీర్మానం చేసింది.?
జ : చంద్రా నగర్

22) “HUMP WWII” మ్యూజియాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.?
జ : హిమాచల్ ప్రదేశ్

23) మహారాష్ట్రలోని రాజ్కోట్ పోర్టులో ఎవరి విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఇటీవల ఆవిష్కరించారు.?
జ : చత్రపతి శివాజీ

24) మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్ – 2023 ఎక్కడ నిర్వహించారు.?
జ : అమృత్ సర్

25) ఇండియా ఏ దేశంతో కలిసి మైక్రో వేవ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ను ప్రయోగించనుంది.?
జ : అమెరికా

26) Welcome Paradise అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : ట్వింకిల్ ఖన్నా

27) ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ పేరు ఏమిటి.?
జ :ఆరోగ్య మైత్రీ ఎయిడ్ క్యూబ్ (గుర్గావ్)

28) ఇండియన్ నావెల్ అకాడమీ నిర్వహించిన అడ్మిరల్ కప్ – 2023 ఎవరు గెలుచుకున్నారు.?
జ : ఇటలీ (భారత్ పై)

29) ఏ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ మరియు ట్రాన్స్ జెండర్ లకు తమ రాష్ట్రంలోని ఆర్టీసీ లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది.?
జ : తెలంగాణ

30) గ్రీన్ రైజింగ్ ఇనిషియోటీవ్ భారత్ ఏ సంస్థతో కలిసి ప్రారంభించనుంది.?
జ : యూనిసెఫ్

31) సెలబ్రిటీలు పెళ్లిలను భారతదేశంలోనే చేసుకోవాలంటూ ప్రధాన నరేంద్ర మోడీ ఇచ్చిన నినాదం ఏమిటి.?
జ : వెడ్ ఇన్ ఇండియా

32) భారత సంస్కృతి, వారసత్వ లను సూచించే ప్రదర్శనను ఏ పేరుతో డిల్లీలో ప్రారంభించారు.?
జ : ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే

33) 10 వేల సంవత్సరాల కిందటి ఆదిమానవుడి వేటాడే రాతి చిత్రాలను ఏ పులుల అభయారణ్యంలో ఇటీవల కనుగొన్నారు.?
జ : సత్‌పుడా పులుల అభయారణ్యం (మధ్యప్రదేశ్)

34) దేశాభివృద్ధిలో యువత‌, విద్యావేత్తలను భాగస్వామ్యం చేయడానికి కేంద్రం డిసెంబర్ 11న ప్రారంభించనున్న కార్యక్రమం పేరు ఏమిటి.?
జ : వికసిత్ భారత్ @ 2047

35) ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లూరు విగ్రహాన్ని ప్రాన్స్ లోని ఏ ప్రాంతంలో ఆవిష్కరించారు.?
జ : సెర్గీ

36) ముస్లిం లు రంజాన్ మాసంలో నిర్వహించే ఏ విందుకు యూనెస్కో ప్రపంచ హెరిటేజ్ గుర్తింపు ఇచ్చింది.?
జ : ఇఫ్తార్ విందు

37) సుప్రీంకోర్టు ఏ చారిత్రాత్మక తీర్పును ఇటీవల తెలుగుతో సహా పది భాషల్లో అందుబాటులో ఉంచారు.?
జ : కేశవానంద భారతి కేసు

38) ఏ లోక్‌సభ ఎంపీ సభ్యత్వంను రద్దు చేశారు.?
జ : మహువా మెయిత్రా

39) మిలాన్ – 2024 నౌకదళ విన్యాసాలు ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : విశాఖపట్నం

40) జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఏ ఆర్టికల్ రద్దను సుప్రీంకోర్టు సమర్ధించింది.
జ : ఆర్టికల్ 370

41) ఏ రాష్ట్ర హైకోర్టు మసీదులలోకి మహిళలను అనుమతించాలని తీర్పు ఇచ్చింది.?
జ : తెలంగాణ హైకోర్టు

42) తెలుగు రాష్ట్రాల నుండి ఏ దేవాలయాలను ప్రసాద్ పథకంలో నూతనంగా చేరుస్తున్నారు.?
జ : అన్నవరం, వేదగిరి

43) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ లాయర్లకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం పేరు ఏమిటి?
జ : వైయస్సార్ లా నేస్తం

44) బి బి సి ఇండియా స్థానంలో ఏ వార్తా సంస్థను భారత్ లో ప్రారంభిస్తున్నట్లు బిబిసి తెలిపింది.?
జ : కలెక్టివ్ న్యూస్ రూమ్

45) భారత్ – వియత్నాం దేశాల మధ్య నాలుగవ సైనిక విన్యాసాలు హనోయ్ ప్రాంతంలో ఏ పేరుతో ప్రారంభమయ్యాయి.?
జ : VINBAX -2023

46) 2014 నుండి ఎన్ని కాలం చెల్లిన చట్టాలను భారత పార్లమెంట్ రద్దు చేసింది.?
జ : 1,562

47) మధ్యప్రదేశ్ లో రోడ్ల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది.?
జ : ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్

48) డిసెంబర్ 20న తెలంగాణలోని ఏ గ్రామాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు.?
జ : భూదాన్ పోచంపల్లి

49) తూర్పు నౌకాదళంలో ఏ యుద్ధ నౌకను పునఃప్రారంభించారు.?
జ : INS – తుర్ముగ్లీ

50) రాజాజీ టైగర్ రిజర్వు కన్జర్వేషన్ ఫౌండేషన్ ను ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది.?
జ : ఉత్తరాఖండ్

51) తెలంగాణలోని ఏ చేనేత కళకు భౌగోళిక గుర్తింపును మరో పదేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.?
జ : పోచంపల్లి ఇక్కత్

52) కేరళ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సింధు నాగరికత పతనానికి కారణం ఏమిటని ఇటీవల ప్రకటించారు.?
జ : ఉల్కాపాతం

54) కేరళ రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన కోవిడ్ ఉప వేరియంట్ ఏది.?
జ : JN.1

55) ఏ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఐదు లక్షల విలువగల విద్య భరోసా ఇవ్వనుంది.?
జ : తెలంగాణ

56) ఏ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం కల్పించింది.?
జ : సూరత్ ఎయిర్ పోర్ట్

57) 67వ జాతీయ స్కూల్ గేమ్స్ 2023 ఎక్కడ ప్రారంభమయ్యాయి.?
జ : శత్రాశల్ స్టేడియం – న్యూ ఢిల్లీ

58) భారత దేశంలో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన ఒమన్ సుల్తాన్ ఎవరు.?
జ : హైతామ్ బిన్ తారీఖ్

59) ఒకేసారి 3,066 మంది తల్లిదండ్రులు – విద్యార్థులు పుస్తక పఠనం చేసి గిన్నిస్ రికార్డు ఎక్కడ నెలకొల్పారు.?
జ : SP COLLEGE పూణే

60) పర్యాటకులకు వీసా లేకుండానే అనుమతి ఇవ్వాలని ఏ దేశం నిర్ణయం తీసుకుంది.?
జ : కెన్యా

61) లారీ క్యాబిన్లలో డ్రైవర్ల పనితీరు మెరుగుపరచడం కోసం ఏసీ కచ్చితంగా ఎప్పటినుంచి అమర్చాలని కేంద్రం గెజిట్ విడుదల చేసింది.?
జ : 2025 జనవరి 1 నుండి

62) బారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏది. .?
జ : సబర్మతి

63)-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించింది. .?
జ : ఉద్దానం

64) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిని ఎంతవరకు పెంచింది.
జ : 25 లక్షలు

65) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిని ఎంతవరకు పెంచింది..?
జ : 10 లక్షలు

66) ఆంధ్రప్రదేశ్ లో ఏ మండలంలో గోల్డ్ మైన్స్ బయటపడ్డాయి.?
జ : అస్పరి మండలం

67) గోల్కొండ నవాబుల పైన దాడి చేసి గోల్కొండ ను ఆక్రమించిన ఏ స్థానిక తిరుగుబాటుదారుడు యొక్క స్మారక పోస్టల్ స్టాంపులను కేంద్రం విడుదల చేసింది.?
జ : సర్వాయి పాపన్న గౌడ్

68) ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : వారణాసి (సర్వ వేద మహ మందిర్)

69) ఇటీవల వార్తల్లోకి వచ్చిన సిల్‌క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : ఉత్తరాఖండ్

70) నూతన పాత పార్లమెంట్ భవనాల రక్షణను ఏ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది.?
జ : సిఐఎస్ఎఫ్


71) ఇండియన్ ఫారెస్ట్ అండ్ ఉడ్ సర్టిఫికేషన్ స్కీంను ఏ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.?
జ : పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ

72) అంతర్జాతీయ గీతా మహోత్సవాలను 2023 సంవత్సరానికి గాను ఏ నగరంలో నిర్వహించనున్నారు.?
జ : కురుక్షేత్ర – హర్యానా

73) ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవాను ఎప్పుడు ప్రారంభించారు.?
జ : 21 -12 – 2022

74) భారతదేశ రిపబ్లిక్ డే – 2023 కు ముఖ్య అతిధిగా ఎవరు హజరు కానున్నారు.?
జ : ఇమ్మాన్యుయొల్ మక్రాన్ (ప్రాన్స్ అధ్యక్షుడు)

75) పిక్షన్ బుక్స్ అమ్మకాలలో 2023 సంవత్సరంలో నిలిచిన పుస్తకం ఏది.?
జ : Welcome To Paradise (ట్వింకిల్ ఖన్నా)

76) జాతీయ గణిత దినోత్సవంను డిసెంబర్ 22న ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : శ్రీనివాస రామానుజన్ అయ్యర్

77) జాతీయ రైతు దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 23

78) డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు.?
జ : చరణ్ సింగ్

79) జల మహోత్సవం – 2023 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : మధ్యప్రదేశ్

80) రాష్ట్రపతి ద్రౌపది రాజస్థాన్ లోని అణు పరీక్షలకు సంబంధం ఉన్న ఏ ప్రాంతాన్ని సందర్శించారు.?
జ : పోఖ్రాన్

81) డిసెంబర్ 30న అయోధ్యలో ఎన్ని “అమృత్ భారత్” రైళ్లను మోడీ ప్రారంభించనున్నారు.?
జ : ఆరు


82) ఒకేసారి ఎంతమంది కూచిపూడి నృత్యకారులు ఏడు నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని హైదరాబాదులో ప్రదర్శించడం ద్వారా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు.?
జ : 3,782 మంది

83) భారత దేశంలో కార్బన్ ఉద్గారాల తగ్గింపు కోసం ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది.?
జ : గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్

84) మణిపూర్ రాష్ట్రం ప్రారంభించిన SAANS ప్రచారం అర్థం ఏమిటి.?
జ : Social Awareness and Action to Neutralize Pneumonia)

85) ఇటీవల మరణించిన మోహిని గిరి జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ గా పని చేశారు. ఆమె స్థాపించిన సంస్థ పేరు ఏమిటి.?
జ : వార్ విడోస్ అసోషియేషన్

86) మిషన్ ఇన్వెస్టిగేషన్ @ 75 డేస్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు.?
జ : బీహార్

87) దేశంలో మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సెంటర్ ను హోం మంత్రి అమిత్ షా ఎక్కడ ప్రారంభించారు.?
జ : చండీగర్

88) వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 24

89) కృత్రిమ మేధా నగరాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది .?
జ : ఉత్తరప్రదేశ్ లక్నోలో

90) బ్రేకింగ్ ది మౌల్డ్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పుస్తక రచయిత ఎవరు .?
జ : రఘురామ రాజన్

91) జాతీయ సుపరిపాలన దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : డిసెంబర్ 25

92) గిగ్ వర్కర్ల కోసం ఐదు లక్షల ప్రమాద బీమాను ప్రకటించిన రాష్ట్రం ఏది.?
జ : తెలంగాణ

93) NAMMA CARGO పేరుతో ఏ రాష్ట్ర రవాణా విభాగం కార్గో సేవలను ప్రారంభించింది.?
జ : కర్ణాటక ఆర్టీసీ

94) రైల్వే ఉద్యోగుల పెన్షన్ల పంపిణీ కోసం ఆర్బీఐ ఏ బ్యాంకుకు అనుమతి ఇచ్చింది.?
జ : బంధన్ బ్యాంక్

95) కునో ఫారెస్ట్ ఫెస్టివల్ 2023 ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : మధ్యప్రదేశ్

96) నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ కు ఎంత మంది సబ్ స్కైబర్ లు చేరారు.?
జ : రెండు కోట్లు

97) సముద్రంలో కలిసిపోయిన ద్వారకా నగరం దర్శనం కోసం భక్తులకు ఏ విధంగా అవకాశం కల్పించాలని ద్వారకా బోర్డ్ నిర్ణయించింది.?
జ : జలంతర్గామి ద్వారా

98) కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని 25 రూపాయలకే ఏ పేరుతో అమ్మడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : భారత్ రైస్

99) జమ్మూ కాశ్మీర్లోని ఏ వేర్పాటువాద సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.?
జ : ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్

100) సంస్కృతి ఉత్సవ్ – 2023 ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : ఉత్తర ప్రదేశ్


101) 99వ తాన్ సేన్ ఫెస్టివల్ 2023 ను ఎక్కడ నిర్వహించారు.?
జ : గ్వాలియర్

102) గ్వాలియర్ నగరంలో ఒకేసారి ఎంతమంది తబలా వాయించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు.?
జ : 1500

103) ఏ రాష్ట్ర ప్రభుత్వం భూముల మ్యాపింగ్ కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.?
జ : హర్యానా

104) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై రచించిన ఏ పుస్తకంను ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ఆవిష్కరించారు.?
జ : Naye Bharath Ka Samveda

105) రాబోయే ఐదు సంవత్సరాలలో ఎన్ని నిఘా ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు.?
జ : 50

106) తమిళనాడు నటుడు విజయకాంత్ మరణించారు. అతను ఏ పార్టీని స్థాపించాడు.?
జ : దేసియ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK)

107) అయోధ్యలో విమానాశ్రయానికి ఎవరి పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : మర్యాద పురుషోత్తం శ్రీరాం ఎయిర్ ఫోర్ట్

108) ఆన్లైన్ లో యూజర్ల డేటాను ఎంతకాలం వాడకుంటే పూర్తిగా తొలగించాలని కేంద్రం నిబంధన తీసుకొచ్చింది.?
జ : మూడు సంవత్సరాలు

109) భారతదేశపు పెట్రో క్యాపిటల్ గా ఏ రాష్ట్రం అవతరించింది.?
జ : గుజరాత్

110) మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజును తబలా దినోత్సవం గా ప్రకటించింది.?
జ : డిసెంబర్ 25

111) యంయన్ నార్వానే విడుదల చేసిన ఆత్మకథ ఏమిటి.?
జ : Four Stars of Destiny

112) అయోధ్య రైల్వే స్టేషన్ కు ఏమని పేరు పెట్టారు.?
జ : అయోధ్య థామ్

113) అంతర్ జిల్లాల మధ్య హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించిన రాష్ట్రం ఏది.?
జ : ఉత్తర ప్రదేశ్

114) అస్సాం లోని ఏ వేర్పాటు వాద సంస్థతో కేంద్ర ప్రభుత్వం మరియు అస్సాం ప్రభుత్వం శాంతి ఒప్పందం చేసుకున్నాయి.?
జ : ఉల్ఫా

115) ULFA – అనగానేమి.?
జ : Untied Liberation Front Of Assam

116) నౌకాదళంలో ఉన్నత స్థాయి అధికారులు ధరించే బ్యాడ్జీలను ఏ సామ్రాజ్య అధినేత వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు.?
జ : చత్రపతి శివాజీ

117) ఏడు క్యాలెండర్ ఇయర్ లలో 2000 లకు పైగా పరుగులు పూర్తిచేసిన ఒకే ఒక క్రికెటర్ గా ఎవరు నిలిచారు.?
జ : విరాట్ కోహ్లీ

118) ఏ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఉద్యోగులకు 50 సంవత్సరాలకే పెన్షన్ బెనిఫిట్స్ ను అందించాలని నిర్ణయం తీసుకుంది.?
జ : జార్ఖండ్

119) రాజస్థాన్లోని ఏ ప్రాంతంలో మొట్టమొదటి స్నేక్ పార్క్ ను ఏర్పాటు చేశారు.?
జ : కోట

120) “WHY BHARATH MATTERS” పుస్తక రచయిత ఎవరు.?
జ : యస్. జయశంకర్

121) అయోధ్య విమానాశ్రయానికి ఎవరి పేరును పెట్టారు.?
జ : వాల్మీకి మహర్షి

122) పర్బతి – కలిసింది – చంబల్ లింక్ ప్రాజెక్టు కోసం ఈ రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి.
జ : రాజస్థాన్ – మధ్యప్రదేశ్