Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > NCRB SUICIDE REPORT : జాతీయ ఆత్మహత్యల నివేదిక

NCRB SUICIDE REPORT : జాతీయ ఆత్మహత్యల నివేదిక

BIKKK NEWS : National Crime Record. Buero sucide report – 2021 ప్రకారం దేశవ్యాప్తంగా 1,64,033 మంది పౌరులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్యల రేటు 26% పెరిగినట్లు నివేదిక తెలుపుతుంది.

★ NCRB SUCIDE REPORT 2021

2021 లో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య – 1,64,033

2021 లో ఆత్మహత్య చేసుకున్న పురుషుల సంఖ్య – 1,18,970

2021 లో ఆత్మహత్య చేసుకున్న మహిళల సంఖ్య – 45,026

2030 నాటికి ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్యను 10 శాతానికి తగ్గించాలని నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ లక్ష్యంగా పెట్టుకుంది

2021లో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఎక్కువ శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్న వారు కాగా, తక్కువ శాతం మంది రైతులు ఉండటం విశేషం.

కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ వల్ల జీవనోపాధి కోల్పోయిన పలు వర్గాల ప్రజల ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడంతో లాక్ డౌన్ తర్వాత ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగింది.

★ సంవత్సరాల వారీగా ఆత్మహత్యల సంఖ్య

2017 – 1,29,887
2018 – 1,34,516
2019 – 1,39,123
2020 – 1,53,052
2021 – 1,64,063

★ 2021లో ఆత్మహత్య చేసుకున్న వివిధ వర్గాల వారి సంఖ్య

స్వయం ఉపాధి :- 20,231
వేతన జీవులు :- 15,870
నిరుద్యోగులు :- 13,714
విద్యార్థులు :- 13,089
వ్యాపారులు :- 12,055
ప్రైవేటు రంగం :- 11,431
రైతులు :- 10,881

FOLLOW US @