ప్రపంచంలో అతి చిన్న మాస్క్ : నాసో 95

ప్రపంచంలోనే అతి చిన్నదైన, ముక్కుకు తగిలించుకొనేందుకు వీలయ్యే ఎయిర్ ఫిల్టర్ సాధనాన్ని ఢిల్లీ ఐఐటీకి చెందిన నానోక్లీన్ గ్లోబల్ అనే స్టార్టప్ తయారు చేసింది. నాసో-95 అని దానికి పేరుపెట్టారు. ఎన్-95 మాస్క్ కన్నా ఎక్కువ ప్రభావం కలిగి ఉంటుందని దీని రూపకర్తలు అంటున్నారు.

దీనిని ముక్కుకు తగిలించుకుంటే బ్యాక్టీరియా, వైరస్ లు, పుప్పొడి రేణువులు, వాయుకాలుష్యం ఏదీ లోపలికి ప్రవేశించదని తెలిపారు. నాసో95 నాలుగు సైజుల్లో లభిస్తుంది. పిల్లలు కూడా దీనిని సురక్షితంగా వినియోగించవచ్చని నానో క్లీన్ గ్లోబల్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Follow Us @