ఏ దేశాలలో భారత సైన్యాధిపతి తొలిసారిగా పర్యటిస్తున్నారు.

భారత సైన్యాధిపతి ఎం.ఎం.నరవణే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), సౌదీ అరేబియాల్లో ఆరు రోజులపాటు (డిసెంబరు 9 నుంచి 14) పర్యటనకు వెళ్లారు.
ఈ రెండు గల్ఫ్‌ దేశాల్లో ఓ భారత సైన్యాధిపతి పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. ఈ రెండు దేశాలతో భారత వ్యూహాత్మక సంబంధాల మెరుగుకు, రక్షణ, భద్రత పరమైన అంశాల్లో సహకార పురోగతికి ఈ పర్యటన కీలకంగా నిలుస్తుంది.
యూఏఈ పర్యటనలో భాగంగా ఆయన ఆయా ఎమిరేట్స్‌ సైన్యాధిపతులు, సీనియర్‌ సైనికాధికారులతో సమావేశం కానున్నారు.

Follow Us @