పల్లాకే సంపూర్ణ మద్దతు – సూర్యాపేట జిల్లా 711 సంఘం

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు ఉద్యోగభద్రత, డి.ఏ., నూతన పి.ఆర్.సి., బదిలీలు జరగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కి దగ్గర మనిషి, శాసనమండలి లో కాంట్రాక్టు అధ్యాపకుల గొంతుక అయినా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూర్యపేట జిల్లా 711 సంఘం జిల్లా అధ్యక్షలు ఎం.హేమచందర్ రెడ్డి తెలిపారు.

అలాగే బేసిక్ పే, ఒక్క రోజు బ్రేక్ లేకుండా 12 నెలల వేతనము‌, సర్వీస్ క్రమబద్ధీకరణ కోసం G. O. No.16 ఇచ్చిన ప్రభుత్వం మన ప్రయోజనాల విషయంలో ఎప్పుడు సానుకూలంగా ఉండే మన ఆరాధ్య దైవం KCR కృతజ్ఞతగా ఎమ్మెల్సీ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

సమస్యలు ప్రశ్నిస్తే పరిష్కరము కావు, సమస్య పరిష్కరించే వారిని ఎన్నుకొకపోతే మన బ్రతుకులు ప్రశ్నగానే మిగుల్తాయి తప్ప పరిష్కారంకావు… సమస్యల పరిష్కారం అనేది ఆయా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంలో ఉంటది మహా అయితే కొంచెం ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా పరిష్కారం లబిస్తుంది.

కావునా దూర దృష్టితో, వివేకవంతంగా ఆలోచించి మన ఇంటర్ విద్యా జె.ఏ.సి అధ్యక్షులు డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి మరియు TGCCLA-711 రాష్ట్ర అద్యక్షుడు కనకచంద్రం రాష్ట్ర నాయకులు జిల్లా నర్సింహ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మన సమస్యలు పరిష్కారం కొరకు ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

నల్లగొండ జిల్లా విప్లవాల ఖిల్లా మనం అనేక పర్యాయలు ప్రశ్నించే స్వభావం, విప్లవ భావాలు గలవారిని ఎన్నుకున్నాం కానీ మన సమస్యలు పరిష్కరించబడలేదు.. జరిగిన ప్రయోజనం శూన్యం

ఈ సందర్భంగా సూర్యాపేట కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల జిల్లా కమిటీ తరపున శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని నల్గొండ జిల్లా 711 సంఘం జిల్లా అధ్యక్షలు ఎం.హేమచందర్ రెడ్డి, తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్, స్టేట్ కౌన్సిలర్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@