సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభను నిర్వహించిన కనకచంద్రంకు ధన్యవాదాలు – నాగర్ కర్నూలు 711 సంఘం

సిద్దిపేటలో కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటు చేసిన సీఎం కృతజ్ఞత సభ విజయవంతం చేయాలని TGCCLA- 711 అధ్యక్షుడు మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ చైర్మన్ సీహెచ్. కనక చంద్రం పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో సుమారు 3000 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొని తమకు బేసిక్ పే ఇచ్చి తమ జీవితాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభను విజయవంతం చేయడం జరిగిందని అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం TGCCLA-711 నాగరకర్నూల్ జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలైన బదిలీలు, భద్రత & క్రమబద్ధీకరణ తదితర సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింప మజేస్తానని హామీ ఇచ్చినందుకు వారికి అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు..

ప్రభుత్వ మరియు కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డా. పి. మధుసూదన్ రెడ్డికి అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా నుంచి హాజరైన జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మారం శోభారాణి చురుకైన పాత్ర పోషిస్తూ రాష్ట్ర ఆర్ధిక మంత్రికి మెమెంటో అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆమెకు జిల్లా అధ్యక్షుడు కె. వెంకటేశ్వర్ రావు అభినందనలు తెలిపారు.

ఈ సమావేశలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి యం. శివప్రసాద్ నాయకులు విఘ్నేశ్వర్, లింగరాజు , విజయలక్ష్మి, శ్యామల, షాహాజాది బేగం, ఈశ్వర్, డిగ్రీ లెక్చరర్ లు ధర్మ, రామకృష్ణ రావు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడం జరిగింది..