మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరిశీలించిన న్యాక్ బృందం.

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పిబ్రవరి 3 మరియు 4 వ తేదీ లలో రెండు రోజుల పాటు న్యాక్ (NACC ) పీర్ కమిటీ పరిశీలించారు.

ప్రొఫెసర్ వర్మ అధ్యక్షతన డా.మధురేంద్ర మరియు డా. అరుణ్ జింగారే లు రెండు రోజుల పరిశీలనలో భాగంగా మొదటిరోజు NCC కాడేట్స్ తో గౌరవ వందనం తో స్వాగతం పలికారు. ఆ పిదప ప్రిన్సిపాల్ నరసింహం ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ జరిగింది.

అనంతరం కళాశాల లోని అన్ని విభాగాలను పర్యవేక్షించారు. పీర్ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధ్యాపకులు తగిన సమాధానాలు ఇచ్చారు. 2014-19 విద్యా సంవత్సరం ఫైళ్లను అన్నింటినీ తనిఖీ చేశారు. మధ్యాహ్నం వివిధ విభాగాలకు చెందిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ జరిగింది. ఆ తరువాత కళాశాల పూర్వ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

సాయంత్రం కళాశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండు రోజుల తనిఖీలో భాగంగా న్యాక్ కమిటీ సభ్యులు ఎగ్జిట్ మీటింగ్ లో కళాశాల నిర్వహణ చాలా బాగుందని ప్రశంసించారు. మీ కృషి కళాశాలకు , విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపయోగపడుతుందని న్యాక్ చైర్మన్ ప్రొఫెసర్ వర్మ అన్నారు. అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ DR.P V నరసింహం గారు మరియు అధ్యాపక , అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.

Follow Us@