317జీవో వలన బదిలీ అయిన వారికే పరస్పర బదిలీల అవకాశం

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల ప్రక్రియ మార్చి ఒకటి నుంచి ప్రారంభమై 15 వరకు కలదు. ఇందుకు దరఖాస్తులను IFIMS పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో స్వీకరించనున్నారు. గడువు ఈ నెల 15 వరకు విధించారు.

ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర బదిలీ కోరుకున్న వారికి సీనియార్టీలో రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది.

★ మార్గదర్శకాలు ::

పరస్పర బదిలీ కోరుకునే ఇద్దరు ఉద్యోగుల్లో కనీసం ఒక్కరైనా జీవో – 317 ద్వారా బదిలీ అయి ఉండాలి.

• ఒక్కరికి మాత్రమే కన్సెంట్ ఇవ్వాలి.

• ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

• హార్డ్ కాపీని జిల్లా, జోనల్ హెడ్ ద్వారా హెచ్.వో.డీ. కి పంపాలి. ఒకసారి సమర్పించిన దరఖాస్తునే అనుమతిస్తారు. ఆపై ఎలాంటి దరఖాస్తులను అంగీకరించరు.

• ఏ పోస్టులో ఉన్న వారు అదే పోస్టులో ఉన్నవారితో పరస్పర బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. సీని యర్ అసిస్టెంట్ గా ఉన్నవారు జూనియర్ అసి స్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేయరాదు. అలాగే టీచర్లు.. ఇంగ్లిష్ మీడియం టీచర్ తెలుగు మీడియం పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అవకాశం లేదు. వ్యవసాయశాఖ సూపరింటెండెంట్. పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ పోస్టుకు దరఖాస్తు చేయరాదు.

• ఒకే మేనేజ్ మెంట్, ఒకే క్యాటగిరీ, సబ్జెక్టు, మీడియంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు మాత్రమే పరస్పర బదిలీకి అర్హులు.

• కోర్టు ఉత్తర్వులతో ప్రస్తుత క్యాడర్ లో కొనసాగుతున్న వారు, సస్పెన్షన్లో ఉన్న వారు, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు పరస్పర బదిలీకి అనర్హులు. అలాంటివారిని అనుమతించరు.

• ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పరం బదిలీ అయితే ఆయా ఉద్యోగి పాత సీనియార్టీని కొత్త జిల్లాలో కొనసాగిస్తారు. అదే ఉమ్మడి జిల్లా మారితే మాత్రం సీనియార్టీ కోల్పోయి, జూనియర్ గా కొనసాగాల్సి ఉంటుంది.

Follow Us @