ఇంటర్ విద్యలో పరస్పర బదిలీలు చేస్తూ ఉత్తర్వులు

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నంబర్ 21 ప్రకారం పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మల్టీ జోనల్ కేడర్ లో నలుగురు, జోనల్ క్యాడర్ లో ఒక్కరు, జిల్లా కేడర్ లో 13 మందికి పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని మల్టీ జోనల్, జోనల్, జిల్లా కేడర్ గా విభజించిన విషయం తెలిసిందే. దీని ఆధారంగా 317జీవో ప్రకారం స్థానిక నిర్దేశిస్తూ బదిలీలు చేసిన నేపథ్యంలో… ఉద్యోగ సంఘాల వినతి మేరకు జీవో నెంబర్ 21 విడుదల చేస్తూ స్పౌజ్, పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం. కల్పించింది.

కమీషనర్ ఉత్తర్వులు pdf

Follow Us @