ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయాలి – తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్

ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు వారు ప్రమోట్ అయిన ఫస్టియర్ (2020-21) పరీక్షలు ఈ నెల 25 నుండి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి పెడ్యూల్ ఇవ్వడం అసంబద్ధం మరియు హాస్యాస్పదమని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఇంతవరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలను ఇంతవరకు ఓపెన్ చేయకపోవడం వలన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆ విద్యార్థులు జీవనాధారం కోసం పొలం పనులు చేసుకుంటున్నారు. వారు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పరిస్థితి కూడా లేదుమని పేర్కొన్నారు.

విద్యార్థులతో నిర్బంధంగా పరీక్షలు రాయించడం సరైంది కాదు. పగలు సెకండియర్ క్లాసులకు హాజరవుతూ రాత్రి పస్టియర్ పారాలు చదవడం విద్యార్ధులకు గందరగోళంగా మారి మానసిక వేదన కలిగిస్తుందని, తల్లిదండ్రులు కూడా ఎందుకీ అనవసరమైన పరీక్షలు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు? అన్నట్లు ప్రమోటైన క్లాసుకి పరీక ఎందుకు” అని అంటున్నారని టీపీఏ సభ్యులు పేర్కొన్నారు.