మున్నూరు కాపు ఇక బీసీ-డీ జాబితాలోకి : సీఎం జగన్

విజయవాడ (ఆగస్టు – 20) : ఆంధ్రప్రదేశ్ లో మున్నూరు కాపు కులస్తులను బీసీ-డీ కేటగిరీలో చేర్చుతూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీసీ-డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు మున్నూరు కాపులు ఓసీ జాబితాలో ఉండేవారు. ఇటీవల గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా సీఎం జగన్కు మున్నూరు కాపులు వినతిపత్రం ఇవ్వడంతో బీసీ-డీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు.

Follow Us @