BIKKI NEWS : పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహత్మ గాంధీ గ్రామ స్వరాజ్య ఆశయం, భారత రాజ్యంగంలో ఆదేశిక సూత్రాలు – 40వ ప్రకరణ లో గ్రామ స్వరాజ్య భావనను పొందుపర్చారు. (muncipal-and-corporation-local-bodies-articles-by-74th-constitutional-amendment)
muncipal and corporation local bodies articles by 74th vconstitutional amendment
స్థానిక సంస్థల ఏర్పాటు అధికారిక వికేంద్రీకరణ పై అనేక కమిటీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అందులో ముఖ్యమైన కమీటీల
- ఆశోక్ మెహతా కమిటీ – 1978
- జీవికే రావ్ కమీటీ – 1985
- ఎల్ఎం సింఘ్వీ కమీటీ – 1986
పై కమిటీల సూచన మేరకు స్థానిక సంస్థల ఏర్పాటు కోసం 1992లో 73, 74 రాజ్యాంగ సవరణలు చేశారు. ఇవి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు కు దోహదపడినవి. ఇవి 1993 లో అమలులోకి వచ్చాయి.
73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి ( గ్రామీణ పంచాయతీ సంస్థలు)
74వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి (పురపాలక, నగర పాలక సంస్థలు)
పట్టణ, నగర పాలనకి సంబంధించిన రాజ్యాంగంలో 243 P నుంచి 243 ZG వరకు ఆర్టికల్స్ ను ప్రవేశపెట్టారు. వాటి గురించి పూర్తిగా నేర్చుకుందాం…
◆ 243 P : పట్టణ స్థానికసంస్థలకు చెందిన పదాల నిర్వచనాలు
◆ 243 Q మూడంచెల మున్సిపాలిటీ వ్యవస్థ ఏర్పాటు : మొదటి అంచె నగర పంచాయితీ, 2వ అంచెమున్సి పాలిటీ కౌన్సిల్ (తక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు), 3వ అంచెమున్సిపల్ కార్పోరేషన్ (అధిక జనాభా ఉన్న నగరాలలో ఏర్పాటు
◆ 243 R: మున్సిపాలిటీల నిర్మాణము, ఎన్నికలు
◆ 243 S: వార్డు కమిటీల ఏర్పాటు (3లక్షల కంటే ఎక్కువ జనాభా గల ప్రాంతాలలో)
◆ 243 T : పట్టణ స్థానికసంస్థలలో సీట్ల రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేయుట)
◆ 243 U : పదవీకాలం (కాల పరిమితి)
◆ 243 V: సభ్యుల అనర్హతలు
◆ 243 W : అధికార విధులు (18)
◆ 243 X : ఆదాయవనరులు
◆ 243 Y : ఫైనాన్స్ కమిషన్
◆ 243 Z : ఖాతాల ఆడిటింగ్
◆ 243ZA: ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాటు
◆ 243ZB : కేంద్రప్రాలిత ప్రాంతాలకు అనువర్తింపు
◆ 243 ZC : కొన్ని ప్రాంతాలకు మినహాయిపులు
◆ 243 ZD : జిల్లా స్థాయిలో జిల్లా ప్రణాళికాకమిటీ ఏర్పాటు
◆ 243 ZE: మెట్రోపాలిటన్ ప్రణాళికా కమిటీ
◆ 243 ZE ప్రకారం ఏర్పాటుచేసే మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడిగా కొనసాగే వ్యక్తి – నగర మేయర్. (దేశంలో మొదటి 6 పెద్ద మెట్రోపాలిటన్ నగరాలు : 1) ముంబై 2) ఢిల్లీ 3) కోల్కతా 4) చెన్నై 5) బెంగళూరు 6) హైదరాబాద్)
- మెట్రోపాలిటన్ సిటీ అనగా 10 లక్షలు లేదా అంత కన్నా ఎక్కువ జనాభా గల నగరం (దీన్ని గవర్నర్ ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా గుర్తిస్తారు)
◆ 243 ZF : పాత శాసనముల కొనసాగింపు
◆ 243 ZG : : న్యాయస్థానాల జోక్యం నుండి మినహాయింపు
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL