బహుముఖ పేదరిక సూచీ 2019 – 21 – తెలంగాణ రాష్ట్రం

BIKKI NEWS : నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచీ 2019 – 21 (MULTI DIMENSIONAL POVERTY INDEX 2019 – 21 – TELANGANA) నివేదికలో దేశంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పేదరికం గణనీయంగా తగ్గింది.

బహుముఖ పేదరిక సూచీ 2019 – 21 ప్రకారం … దేశంలో పేదరికం 14.96% ఉండగా… తెలంగాణ లో 5.88%, ఆంధ్రప్రదేశ్ లో 6.06% గా నమోదు అయింది.

బహుముఖ పేదరిక సూచీ 2015 – 16 ప్రకారం … దేశంలో పేదరికం 24.85% ఉండగా… తెలంగాణ లో 13.18%, ఆంధ్రప్రదేశ్ లో 11.77% గా నమోదు అయింది.

◆ పేదరికం ఎక్కువ ఉన్న రాష్ట్రాలు

దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్ – 33.76%, జార్ఖండ్ – 28.81% మేఘాలయ – 27.79%, ఉత్తరప్రదేశ్ – 22.93%, మద్యప్రదేశ్ – 20.63% గా ఉంది.

◆ అత్యంత, అత్యల్ప పేదరికం గల జిల్లాలు

తెలంగాణలో గ్రామీణ పేదరికం 7.51% కాగా నగరాలు- పట్టణాలలో 2.73% గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పేదరికం గల జిల్లాలు… కుమురం భీం – 16.59%, గద్వాల – 15.37%, ఆదిలాబాద్ – 14.24%, వికారాబాద్ – 12.50%, కామారెడ్డి – 11.90%, మహబూబ్‌నగర్ – 10.27% ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ పేదరికం గల జిల్లాలు… పెద్దపల్లి – 2.17%, వరంగల్ అర్బన్ – 2.41%, కరీంనగర్ – 2.50%, హైదరాబాద్ – 2.50%, జనగాం – 2.91% గా ఉన్నాయి.

◆ పోషకాహార లోపం

తెలంగాణలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య 2015 16 లో 9.78% కాగా, 2019 – 21 లో 4.91% నమోదయింది. ఇల్లు లేని వారి సంఖ్య 2015 – 16 లో 8.07% కాగా, 2019 – 21 లో 3.17% నికి తగ్గింది.