హైదరాబాద్ (సెప్టెంబర్ – 22) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వొకేషనల్ విభాగంలో పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ జూనియర్ లెక్చరర్లు 29మందిని జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో నెంబర్ 16 ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11003 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ శరవేగంగా నడుస్తున్నట్లు సమాచారం.