ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన కాళోజీ వర్శిటీ

ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసిం ది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధారంగా ప్రొవిజినల్ మెరిట్ లిస్టు విడుదల చేశామని పేర్కొంది.

ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను వెల్లడిస్తారని తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 4న ధ్రువపత్రాల పరిశీలనకు కూకట్ పల్లి జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన సెంటర్‌కు హాజరు కావాలని వెల్లడించింది.

మరింత సమాచారం కోసం వెబ్సైట్ :- www.knruhs.telangana.gov.in

Follow Us @